జగన్ కేసుల్లో సాక్ష్యాలను ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది.. సీబీఐ వాళ్లు భద్రతను ఏర్పాటు చేయాలి: బుద్ధా వెంకన్న

16-04-2022 Sat 15:17 | Andhra
  • వివేకా హత్య కేసు ఆధారాలకు కూడా భద్రత కల్పించాలన్న బుద్ధా 
  • జగన్ అవినీతిలో భాగస్వామివంటూ విజయసాయిపై విసుర్లు
  • జాబ్ మేళా పేరుతో జగన్నాటకానికి తెర తీశారని విమర్శ
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు నుంచి దొంగిలించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, కోర్టులో ఉన్న సాక్ష్యాలను దొంగిలించడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో కూడా సాక్ష్యాలను ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని... ఆ సాక్ష్యాలకు సీబీఐ వాళ్లు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని అన్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని ఆధారాలకు కూడా భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కూడా బుద్ధా వెంకన్న మండిపడ్డారు. వైసీపీ కుల పార్టీనా? టీడీపీ కుల పార్టీనా? అనే విషయం తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు నిన్ను జగన్ ఇన్ఛార్జీని చేశారని, తనను చంద్రబాబు ఇన్ఛార్జీని చేశారని... ఎవరిది కుల పార్టీ అని ప్రశ్నించారు. కులాన్ని చూసుకున్నది ఎవరని అడిగారు. 

జగన్ అవినీతిలో భాగస్వామివని, ఆయనతో కలిసి జైలుకు వెళ్లావని, అందుకే నీకు రాజ్యసభ సీటు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయాయని... ఇప్పుడు జాబ్ మేళా పేరుతో జగన్నాటకానికి తెర తీశారని విమర్శించారు.
Budda VenkannaTelugudesamJaganVijayasai ReddyYSRCP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more